మోంథా వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: MLA
PPM: జియ్యమ్మవలస మండలం డంగభద్ర గ్రామంలో మొంథా తుఫాన్ పడిపోయిన వరి చేను పంట నష్టాన్ని గురువారం కురుపాం MLA తోయక జగదీశ్వరి పరిశీలించారు. ఈ మేరకు ఆమె అధికారులు పంట నష్టం పై త్వరగా నివేదిక ఇవ్వాలి అని ఈవోని ఆదేశించారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అన్నారు. అనంతరం దెబ్బతిన్న పంటలకు సహాయం అందేలా చర్యలు చేపడతాము అని హామీ ఇచ్చారు.