కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా..!
బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బోయిన కిషోర్ ప్రతిభ కనబరిచి, APPSC విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. చీరాల (మం) బోయినవారిపాలెం గ్రామానికి చెందిన కిషోర్, 2018 బ్యాచ్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్పీ కార్యాలయం పరిధిలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.