బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

JN: జనగామ పట్టణ కేంద్రంలోని బతుకమ్మకుంట అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్స్, ఐ లవ్ యూ జనగామ, బ్యూటీఫికేషన్, చిల్డ్రన్ పార్క్, లైటింగ్, గ్రిల్స్, బెంచ్‌లు వంటి పనులు వేగవంతం చేయాలని సూచించారు. చెత్త తొలగించి పూల మొక్కలతో పార్క్‌ను అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.