ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ

CTR: గంగవరం మండలంలోని చెన్నారెడ్డి పల్లె మాదిగ పల్లిలో ఎమ్మార్పీఎస్ జెండాను పార్టీ నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. మాదిగల సంక్షేమానికి గత 30ఏలుగా మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేశారని ఎంఎస్పి పలమనేరు గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో యువరాజు, కృష్ణ, గోవింద్, మురళి తదితరులు పాల్గొన్నారు.