వాతావరణంలో మార్పు.. అన్నదాతల ఆందోళన

వాతావరణంలో మార్పు.. అన్నదాతల ఆందోళన

KMM: వరి కోతల సమయంలో వాతావరణంలో వస్తున్న మార్పులు వల్ల మండల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఆరబోసిన ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటూ నష్టపోతున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.