నిమ్స్‌లో అందుబాటులోకి ఆధునిక చికిత్సలు
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఈ ఏడాది కొత్తగా మరిన్ని ఆధునిక సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ వంటి 30 విభాగాల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు అందిస్తున్నారు. పెరుగుతున్న రోగుల కోసం మరో 2 వేల పడకలను పెంచేందుకు అదనపు భవనాల నిర్మాణం జరుగుతోందని డైరెక్టర్ డా. బీరప్ప తెలిపారు.