కలికిరిలో విషం తాగి వ్యక్తి మృతి

కలికిరిలో విషం తాగి వ్యక్తి మృతి

అన్నమయ్య: కలికిరి పంచాయతీ తుమ్మల పేట వడ్డిపల్లికి చెందిన చలమకోటి వెంకట రమణ విషం తాగి శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను కుటుంబ ఖర్చులు, ఇతర అవసరాల నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చడానికి కేరళకు వెళ్లాడు. అక్కడ పనులు, సంపాదన లేకపోవడంతో ఇంటికి వచ్చి, మనోవేదనకు గురై విషం తాగాడు.