విశాఖలో ఆకట్టుకున్న సత్యసాయి ఎగ్జిబిషన్
VSP: శ్రీ సత్యసాయి నేషనల్ కౌన్సిల్ మార్గదర్శకత్వంలో శ్రీ సత్యసాయి విద్యా విహార్ విశాఖలో శనివారం "భారతీయ సంస్కృతి-వారసత్వం"పై ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ‘ఏకోహం బహుశ్యామ్" అనే థీమ్‌తో జరిగిన ఈ ప్రదర్శనను శ్రీ సత్యసాయి రాష్ట్ర ట్రస్టు సభ్య కార్యదర్శి శ్రీ ఎం.వి.ఆర్. శేష సాయి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.