దరఖాస్తు గడువు ఈనెల 17 వరకు పొడిగింపు

AKP: నర్సీపట్నంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి. సుధీర్ తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తు రుసుం రూ.5 లక్షలు(నాన్ రిఫండబుల్), రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానం ద్వారా నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.