అమ్మవారి పండుగలు అంగరంగ వైభవంగా జరగాలి

మన్యం: సాలూరులో ఈనెల 18-21వ తేదీ వరకు శ్రీ శ్యామలాంబ తల్లి అమ్మవారి పండుగలు అంగరంగ వైభవంగా జరగాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. శ్యామలాంబ అమ్మవారి పండుగల నిర్వహణపై సోమవారం సాలూరు మున్సిపల్ కార్యాలయలో సమావేశం జరిగింది. 15 ఏళ్ల తరువాత జరుగుతున్న శ్యామలాంబ పండుగలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.