VIDEO: రైతుల సమస్యలపై మాజీ మంత్రి ఆవేదన

MBNR: హన్వాడలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిస్థితి శోచనీయంగా ఉందని అన్నారు. వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.40 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.