భూములపై ప్రజాభిప్రాయ సేకరణ

భూములపై ప్రజాభిప్రాయ సేకరణ

ASR: రాజవొమ్మంగి మండల రెవిన్యూ కార్యాలయం వద్ద రైతులతో పోలవరం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆంజనేయులు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి మండలంలో భూములు ఇవ్వాలని రైతులను ఆయన కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర అందజేస్తామని, భూములు ఇచ్చే వారుంటే తెలియజేయాలని కోరారు.