ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

GDWL: నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాల వల్ల జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కృష్ణ, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.