నగరంలో మరో అగ్ని ప్రమాదం
HYD: నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాప్రా సర్కిల్ పరిధిలోని హెచ్ కాలనీలో ఓ ప్లైవుడ్ దుకాణంలో నిన్న రాత్రి షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దుకాణంలో ఉన్న వస్తువులు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.