నర్సరీ ప్రాంతంలో పందుల సంచారం

నర్సరీ ప్రాంతంలో పందుల సంచారం

E.G: కడియం మండలం మాధవరాయుడుపాలెం నర్సరీ ప్రాంతాల్లో పందుల ప్రవేశం వల్ల మొక్కలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందులు భూమిని త్రవ్వడం వల్ల చిన్న మొక్కలు, వేర్లు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. అలాగే విలువైన, అరుదైన మొక్కలు నాశనం కావడంతో భారీ నష్టం కలుగుతుందన్నారు. పందులు సంచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.