కడప జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు
కడప జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు తహసీల్దారుగా ఉదయ్ భాస్కర్ రాజు నియమితులయ్యారు. తొండూరుకు మధువాణి, సింహాద్రిపురానికి అనురాధను నియమించారు. పోరుమామిళ్లకు విజయ్ కుమార్‌ను కొత్త తహశీల్దారుగా నియమించారు. అవధూత కాశినాయనకు లక్ష్మీనారాయణను తహశీల్దారుగా నియమించారు.