తగ్గిన 'మొంథా' తుఫాన్ ఎఫెక్ట్
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ బలహీనపడడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాలతో అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడి, ప్రస్తుతం తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ వాయుగుండం కారణంగా రాష్ట్రంలో వర్ష తీవ్రత తగ్గిపోయిందని స్పష్టం చేసింది.