పనికి వెళ్లిన వ్యక్తి మిస్సింగ్.. కేసు నమోదు
VKB: బషీరాబాద్ మండలం నవాంగి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నుమానాలి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురువ జగ్గప్ప(50) నవంబర్ 13 పని కోసం వెళ్లగా, సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. భార్య పార్వతి బంధువుల వద్ద, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.