జాతీయ రహదారి విస్తరణ పనులు పరిశీలన
MNCL: హాజీపూర్ మండలంలోని పోచంపహాడ్ గ్రామ పరిధిలో జాతీయ రహదారి 63 విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. వివిధ ధ్రువపత్రాల కొరకు వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి గడువులోగా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.