నేడే జిల్లా పెంటాథలాన్ జట్ల ఎంపికలు
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో అండర్-17 బాల బాలికల మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు శనివారం జరగనున్నాయి. వీరులపాడు మండలం పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో ఉదయం 9 గంటలకు ఇవి ప్రారంభమవుతాయి. క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు అరుణ, గంప రాంబాబు తెలిపారు.