'సోమవారం నుంచి యధావిధిగా మంచినీటి సౌకర్యం'

W,G: మేజర్ పంచాయితీ దేవరపల్లిలో మంచినీటి పైప్ లైన్ మరమ్మతుల కారణంగా గత రెండ్రోజులుగా మంచినీటి సమస్య నెలకొంది. దీనిపై పంచాయితీ పాలక సభ్యులు రాంగోపాల్, గ్రామ కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ.. ప్రతి మంచినీటి పాయింట్‌ను కాంట్రాక్టర్‌తో కలిసి చెక్ చేశామని, సోమవారం నుంచి యధావిధిగా మంచినీటిని ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రజలందరూ గమనించి తమకు సహకరించాలన్నారు.