రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని

అనంతపురంలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శన కనబరిచిన గుంతకల్లుకు చెందిన అమూల్య, రాష్ట్రస్థాయి అండర్-20 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అమూల్య, ఈ నెల 27న ఏలూరులో జరిగే పోటీల్లో జిల్లా తరపున పాల్గొననుంది. ఆమె విజయంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు