గుంటూరులో పొట్టి శ్రీరాములు వర్దంతి కార్యక్రమం
GNTR: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు సోమవారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) , కమిషనర్ పులి శ్రీనివాసులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.