VIDEO: రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు
VZM: జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలోని గ్రామాల్లో రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శనివారం గంట్యాడ ఎస్సై సాయికృష్ణ తెలిపారు. వాహనదారులు అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. మండలంలోని ప్రధాన జంక్షన్‌లలో స్టాపర్లను ఏర్పాటు చేశామన్నారు.