'బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు'
SRPT: ఆడపిల్లలను చదివించే దిశగా ప్రోత్సహించాలని, బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు హెచ్చరించారు. మున్యానాయక్ తండాలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే తల్లిదండ్రులతోపాటు ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.