మీ ఫోన్ పోయిందా? ఆందోళన వద్దు!

మీ ఫోన్ పోయిందా? ఆందోళన వద్దు!

కామారెడ్డి పోలీసులు నెలకు 100కు పైగా పోగొట్టుకున్న ఫోన్‌లను రికవరీ చేస్తున్నారని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలో మొత్తం మీద రూ. 61 లక్షలు విలువగల 384 ఫోన్‌లను, గత ఏడాది రూ. 7.46 కోట్ల విలువగల మొత్తం 4,665 ఫోన్‌లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఫోన్ పోతే ఆందోళన చెందవద్దని, వెంటనే https://ceir.gov.in లో నమోదు చేయాలని పేర్కొన్నారు.