అనాథ బాలికల విద్యాభివృద్ధికి దరఖాస్తుల ఆహ్వానం
MHBD: 2026-27 విద్యా సంవత్సరానికి గాను అనాథ బాలికల నుంచి డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సబిత తెలిపారు. తల్లిదండ్రులు లేదా ఒకరిని కోల్పోయిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. మొత్తం 360 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల వారు తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.