ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

JN: జనగామ పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ‘డిమాండ్స్ డే’ సందర్భంగా సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సాధారణ సేవలు కొనసాగిస్తూ, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ శాంతియుత మార్గాన్ని ఎంచుకొని,తమ డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామన్నారు.