ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: నాగలిగిద్ద మండలం దామరగిద్ద గ్రామంలో ఓ లబ్ధిదారు ఇందిరమ్మ గృహన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి నేడు పూజలు చేసి ప్రారంభించారు. స్థానిక లబ్ధిదారు చంద్రమ్మ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సహకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు.