వేములవాడ మహాశివరాత్రి జాతరకు వెయ్యి బస్సులు

కరీంనగర్: వేములవాడ మహా శివరాత్రి జాతర కోసం 1000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్, హన్మకొండ, హైద్రాబాద్, మెట్ పల్లి, కోరుట్ల, ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, నర్సంపేట రోడ్లలో ఈ బస్సులు 7, 8 ,9 తేదీలలో నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.