నేడు సోమాపురంలో రీ సర్వే గ్రామసభ

నేడు సోమాపురంలో రీ సర్వే గ్రామసభ

KDP: చాపాడు మండల పరిధిలోని సోమాపురం గ్రామంలో బుధవారం ఉదయం 10 గంటలకు రీ సర్వేకు సంబంధించి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రమాకుమారి తెలిపారు. మండల పరిధిలో 5వ విడత కింద సోమాపురం, పిచ్చపాడు గ్రామాలను రీ సర్వేకు ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. రైతులకు రీసర్వే సంబంధించిన పూర్తి వివరాలను గ్రామసభలో వివరిస్తామని తెలిపారు.