పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

NLG: ఇంటర్ పరీక్షల సందర్బంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. ప్రగతి జూనియర్ కళాశాలలో పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.