జమ్మూలో పర్యటించిన చైనా వ్యక్తి అరెస్ట్
వీసా రూల్స్ అతిక్రమించిన చైనా పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. NOV 19న బౌద్ధమత ప్రదేశాల సందర్శనకు టూరిస్ట్ వీసాతో ఢిల్లీకి వచ్చాడు. కానీ నిబంధనలను అతిక్రమించి రెండు వారాలుగా లద్దాక్, జమ్మూకి వెళ్లాడు. అలాగే ఆర్టికల్ 370, CRPF బలగాల మోహరింపు, సెక్యూరిటీ వివరాలను ఫోన్‌లో సెర్చ్ చేసినట్లు గుర్తించడంతో సెక్యూరిటీ ఏజెన్సీలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి.