కొనుగోళ్ళ వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలి

JGL: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబందించి ధాన్యం అమ్మిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని తద్వారా రైతులకు డబ్బులు వెంట వెంటనే జమ అవ్వడానికి అవకాశం ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత అన్నారు. గురువారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, రూరల్ మండలం హైదర్పల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.