జిల్లాలో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

KMM: ఖమ్మం జిల్లాలో సోమవారం ఉ.8:30 నుంచి మంగళవారం ఉ.8:30 వరకు 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కల్లూరు మండలంలో 7.6, సింగరేణి మండలంలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు. కాగా రాగల 3 రోజులు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.