సింహాద్రి అప్పన్నకు స్వర్ణపుష్పార్చన
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి స్వర్ణ పుష్పార్చన గురువారం వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సుందరంగా అలంకరించారు. ఆలయ కళ్యాణ మండపంలో వేద మంత్రాలు, నాదస్వరాల నడుమ స్వర్ణ పుష్పార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.