ఉద్యోగ విరమణ సహజం: డీఈవో
MDK: ప్రభుత్వ విధి నిర్వహణలో ఉద్యోగ విరమణ సహజమని డీఈవో విజయ అన్నారు. బుధవారం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాల గ్రేడ్-2 హెచ్ఎం నాగుల్ మీరా పదవీ విరమణ వేడుకలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి హెచ్ఎంను ఘనంగా సన్మానించారు.