'200రోజులు పని దినాలు కల్పించాలి'

NDL: ఉపాధి హామీ పథకం కింద ప్రతి జాబ్ కార్డుకు 200రోజులు పని దినాలు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం నందికొట్కూరు మండలంలోని నాగటూరు గ్రామంలో ఉపాధి పనులు మండల నాయకులతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ..పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక రోజుకు రూ.600లు ఇవ్వాలని, చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అన్నారు.