వీరపునాయునిపల్లె రైతులకు గమనిక

KDP : దిగుబడి ఆధారిత పంటలకు ప్రీమియం గడువు పొడిగించారని వీరపునాయునిపల్లె మండల వ్యవసాయ అధికారి శ్యాంబాబు తెలిపారు. ఈనెల 31వ తేదీలోగా రైతులు ప్రీమియం చెల్లించాలని ఆయన సూచించారు. ఈ మేరకు పంటలు సాగు చేసిన రైతులు ప్రీమియం చెల్లిస్తే పంట నష్టం జరిగినప్పుడు మెరుగైన పరిహారం వస్తుందన్నారు. అనంతరం ఈక్రాప్ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.