నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
KMM: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి తెలిపారు. కామేపల్లి, టేకులతండా, రాయిగూడెం, పొన్నెకల్లు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని తెలిపారు.