VIDEO: దగదర్తిలో ట్రాక్టర్ నడిపిన మాలేపాటి

NLR: పార్టీ సీనియర్ నాయకులు మాలేపాటి రవీంద్ర నాయుడును సోమవారం దగదర్తి పట్టణంలోని ఆయన నివాసంలో పలు గ్రామాల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ముందు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరగా, సమస్యలన్నీ త్వరగా పరిష్కరిస్తామన్నారు. అనంతరం మాలేపాటి రవీంద్ర నాయుడు స్వయంగా ట్రాక్టర్ నడిపాడు.