DIGITAL TWIN' ఆడిట్ అంటే ఏంటంటే.?
HYD: నగరంలో గృహ నిర్మాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక 'డిజిటల్ ట్విన్' ఆడిట్‌ను ప్రవేశపెట్టింది. డ్రోన్ సర్వే ద్వారా ప్రతి భవనానికి 3D డూప్లికేట్ మోడల్‌ను సిద్ధం చేశారు. అనుమతికి మించి అదనపు కట్టడాలు చేపట్టినా, పార్కింగ్‌ను గదులుగా మార్చినా AI వెంటనే పసిగడుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన యజమానుల ఫోన్‌లకే నేరుగా నోటీసులు అందనున్నాయి.