సీఎం చంద్రబాబుపై శైలజానాథ్ విమర్శలు
ATP: బుక్కరాయసముద్రం, సింగనమల ప్రాంతాల్లోని అరటి తోటలను మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్ శుక్రవారం పరిశీలించారు. అరటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు గుండెకోతకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గాల్లో తిరగడం మానేసి, రైతుల వద్దకు వస్తే బాధలు అర్థమవుతాయని ఆయన విమర్శించారు.