అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తాం: దస్తగిరి

KNL: అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తానని కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, ఎంపీ అభ్యర్థి నాగరాజు అన్నారు. సి.బెళగల్ మండల కేంద్రం, కంబదహాల్, క్రిష్ణదొడ్డి గ్రామాల్లో టీడీపీ ప్రచారం మండల కన్వీనర్ గోవిందగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి దస్తగిరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే వెనుకబడిన కోడుమూరు నియోజకవర్గం కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు.