వర్ష సూచనతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

పగోజిల్లాలో మే 14,15 తేదీల్లో భారీ వర్ష సూచన హెచ్చరికల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. అఖిల భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఐఎండీ బులిటెన్ అనుసరించి కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గంటకు 50-60 కిమీ ల నుంచి 70 కిమీ ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలియ జేయడమైందన్నారు.