ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు
కరీంనగర్ నగరంలోని కోర్టు రోడ్డులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేసి గుర్తింపు రద్దు చేయాలని ఎంఐఎం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ (M) శాత్రాజుపల్లికి చెందిన సాహెబ్ బీ (60) మృతి చెందినా, చికిత్స చేస్తున్నట్లు నటించారని, ఆరోగ్యశ్రీ పథకం ఆమోదం పొందినా, డబ్బులు లాగారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.