VIDEO: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న దీక్ష విరమణ కార్యక్రమం
కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజు భవానీల దీక్ష విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా నిన్న 45 వేల మందికి పైగా భవానీలు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈరోజు దుర్గమ్మ దర్శనార్థం వేల సంఖ్యలో భవానీలు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో నేడు అంతరాలయ దర్శనంతో పాటు వీఐపీ సేవలను రద్దు చేశారు.