రోడ్లపై నిలుస్తున్న నీరు.. ప్రజల ఇక్కట్లు

రోడ్లపై నిలుస్తున్న నీరు.. ప్రజల ఇక్కట్లు

మేడ్చల్: ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీనగర్ వెళ్లే మార్గాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోతుంది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ప్రయాణికులు, వాహనదారులు వాపోయారు. పలుచోట్ల రోడ్లు వంపుగా ఉన్నాయని, అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రోడ్డు పాడయ్యే అవకాశాలున్నాయని వాపోతున్నారు.