VIDEO: గ్రామం అందరికీ ఆదర్శం..!
BHPL: జిల్లా వ్యాప్తంగా జాజిరి ఆటలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో BHPL జిల్లా కొంపెల్లిలో గ్రామస్తులు జాజిరి ఆడి సేకరించిన డబ్బులను స్థానిక రాములయ్య ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు తెలిపారు. జాజిరి ఆటల ద్వారా సేకరించిన నిధులను గ్రామ అభివృద్ధికి ఉపయోగించడం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.