కూటమి ప్రభుత్వంపై రాజీవ్ కీలక ఆరోపణలు
VSP: సీఎం చంద్రబాబు అసమర్థ పాలన కారణంగా ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలో అట్టడుగున నిలిచిందని వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై సమర్పించిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన తెలిపారు.